హఫీజ్‌ సయీద్‌కు ఉగ్రవాదంతో సంబంధం:పాకిస్తాన్

19:40 - April 21, 2017

హైదరాబాద్: ముంబై దాడుల మాస్టర్‌ మైండ్‌ హఫీజ్‌ సయీద్‌కు ఉగ్రవాదంతో సంబంధం ఉందని పాకిస్తాన్‌ పేర్కొంది. హఫీజ్‌ ఉగ్రవాదేనంటూ లాహోర్‌ హైకోర్టులో పాకిస్తాన్‌ హోంశాఖ అఫిడవిట్‌ దాఖలు చేసింది. పాక్‌ ప్రభుత్వం తనను చట్ట విరుద్ధంగా కొన్ని నెలలుగా నిర్బంధంలో ఉంచిందని పేర్కొంటూ జమాత్‌-ఉద్‌-దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పాకిస్తాన్‌ హోంశాఖ- హఫీజ్‌ సయీద్‌కు ఉగ్రవాదంతో సంబంధం ఉందని ప్రమాణపత్రంలో పేర్కొంది. యాంటీ టెర్రరిజం యాక్ట్‌ ప్రకారం సయీద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు హోంశాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్‌లో శాంతి భద్రతలను అస్థిర పరుస్తున్నారని హఫీజ్‌పై ఆరోపణలున్నాయి. 

Don't Miss