మలుపులు తిరుగుతున్న హరీష్‌ ఆత్మహత్య కేసు

19:33 - January 30, 2018

శ్రీకాకుళం : జిల్లాలోని పలాస కాశీబుగ్గలో ఆత్మహత్య చేసుకున్న హరీష్‌ కేసు నిముషానికో మలుపు తిరుగుతోంది. హరీష్ మృతికి పలాస మున్సిపాలిటీ 14వ వార్డు కౌన్సిలర్ పైల చక్రధరరావుతో పాటు సీఐ అశోక్‌ కుమార్ వైఖరి కారణమంటూ స్ధానికులు హరీష్‌ మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. భారీ ర్యాలీ తీసి రోడ్డుపై బైఠాయించారు. డిగ్రీ చదువుతున్న హరీష్‌ పలాస కాశీబుగ్గలోని లక్ష్మీ స్వీట్ షాపులో పనిచేస్తున్నాడు. స్వీట్ షాపుకు వెళ్లిన కౌన్సిలర్ చక్రధర్‌ను శాంపిల్స్ పేరుతో స్వీట్‌ను ఎంగిలి చేయవద్దని హరీష్‌ వారించాడు. వెంటనే కౌన్సిలర్ చక్రధర్ హరీష్ పై దాడి చేశాడు. అనంతరం రైల్వే ట్రాక్‌పై హరీష్‌ మృతదేహం గుర్తించడం పలు అనుమానాలకు తావిస్తోంది. 14వ వార్డు కౌన్సిలర్ చక్రధర్‌తో పాటు.. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న సి.ఐ అశోక్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు. 

 

Don't Miss