ధనియాలు... ఆరోగ్యరహస్యాలు...

13:21 - August 19, 2017

ధనియాలు అంటే తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. వంటిట్లో పోపుల పెట్టెలో ఉండే ఔషధం…. మనకు తెలియని ధనియం….! కేవలం వంటింటి దినుసుగానే కాకుండా ధనియాలను ఔషధంగా కూడా వాడవచ్చు. ఇటీవల జరిగిన అధ్యయనాల్లో ధనియాలు కార్మినేటివ్‌గా (గ్యాస్‌నుంచి ఉపశమనం కలిగించేదిగా) పనిచేస్తుందని తేలింది.అలాగే రిఫ్రిజిరెంట్‌గా (శరీరాన్ని చల్లపరిచేదిగా), డైయూరిటిక్‌గా (మూత్రాన్ని జారిచేసినదిగా), ఏఫ్రోడైజియాక్‌గా (లైంగిక శక్తిని పెంచేదిగా), యాంటీ స్పాస్‌మోడిక్‌గా (అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా), హైపోగ్లైసీమిక్‌గా (రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించేదిగా) పనిచేస్తుందని తేలింది. ఇన్ని సుగుణాలున్న ధనియాలను చూస్తుంటే ప్రకృతి ప్రసాధించిన ఒక వరంగా మనం భావించాలి. కొత్తిమీర చెట్టునుండి కాచే ఈ ధనియాల కాయలను ఎండవెట్టి, తర్వాత గింజల రూపంలో లేదా, పౌడర్ రూపంలో వీటిని ఉపయోగించుకుంటారు. ధనియాల్లో అనేక పోషకాంశాలున్నాయి. న్యూట్రీషియన్ చార్ట్ ప్రకారం ఇందులో ఫైబర్ 8%, కాల్షియం 2.9%, ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

జలుబును నయం చేసే లక్షణాలు...

ధనియాల కషాయం తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది.జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం, విరేచనాలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కడుపులో ఏలికపాముల్ని బయటపడేస్తుంది.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ శక్తి...

ప్రకృతిపరంగా లభించిన ధనియాలలో అనేక వైద్యపరమైన లక్షణాలు కలిగి ఉండటం వల్ల సహజ రూపంలో మన తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గిచవచ్చని అనేక పరిశోధనులు, అధ్యయనాలు చెబుతున్నాయి. మధుమేమం రాకుండా నిరోధించడానికి మరియు ఉన్న వ్యాధిని నయం చేయడానికి ఉపయోగపడుతుంది.

టైఫాయిడ్ నుండి కోలుకొనేలా

టైఫాయిడ్ కు కారణం అయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడుతుందని రుజువయ్యింది. ఆహారం వల్ల కలిగే అనారోగ్యంకు సాల్మొనెల్లా కారణం అవుతుంది.

మచ్చల నివారణలో...

ధనియాల పొడి మరియు పసుపు లేదా ధనియాల రసంతో మిక్స్ చేసి మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కొలెస్ట్రాల్ నియంత్రలణలో...

కొలెస్టరాల్ ఆధిక్యత ధనియాల పొడి కొలెస్టరాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. రెండు చెంచాలు ధనియాలను నలగ్గొట్టి ఒక గ్లాసు నీళ్లకు చేర్చి మరిగించి చల్లారిన తరువాత వడపోసుకొని తాగాలి. ఇలా రెండుపూటలా కొన్ని నెలలపాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

అంటువ్యాధుల నివారణలో....

అంటువ్యాధులకు కారణం అయ్యే జర్మ్ (సూక్మక్రిముల)తో పోరాడటానికి మరియు చంపడానికి ధనియాల్లోని ఔషధగుణాలు అద్భుతంగా సహాయపడుతాయని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.

ఫీరాడికల్స్ ను తొలగించడంలో...

ధనియాలు(కొత్తిమీర, ధనియాలు, లేదా పొడి) ఇలా ఏరూపంలోనైనా సరే తీసుకోవడం వల్ల వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్ ను మన శరీరానికి అందిస్తుంది. దాంతో మన శరీరంలోని ఫ్రీరాడికల్స్ ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.

మరి ఇంక ఎందుకు ఆలస్యం... రోజు వారీ ఆహారంలో ధనియాలను చేర్చుకుంటే పోలా.

Don't Miss