ఆరోగ్యానికి ఆనపకాయ..

16:04 - August 8, 2017

కాకరకాయ, సోరకాయ (ఆనపకాయ), బీరకాయ, గుమ్మడికాయ, బూడిద గుమ్మడి, దోసకాయ పంటలు ప్రసిద్ధి. వీటికి వేడి వాతావరణం అనుకూలం. అధిక దిగుబడిని పొందడానికి నీరు నిల్వని తేలికపాటి బంకమట్టి నేలలు అనువైనవి. ఇక ఆనపకాయను సోరకాయ అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో పలు రకాల వంటలు వండుకోచ్చనే సంగతి తెలిసిందే.

సోరకాయను ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంది. ఇందులో డయటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
సోడియం, పోటాషియంతో పాటు అన్ని రకాల సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీనితో వండిన వంటలు తినడం వల్ల కడుపు నిండిపోయిన భావన కలుగుతుంది.
సోరకాయలో అధికంగా నీరు ఉంటుంది. తరచూ అలసటగా ఉండే వారు సోరాకయ తినడం వల్ల త్వరగా శక్తి సమకూరుతుంది.
కొలెస్ట్రాల్ పాళ్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది.
పీచుపాళ్లు తక్కువగా ఉండడం వల్ల మలబద్దకం నివారిస్తుంది. జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. పైల్స్ తో బాధ పడే వారు సోరకాయను ఎక్కువగా తింటే బెటర్.
కాలేయానికి కూడా మేలు చేస్తుంది. కాలేయం పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

సోరకాయ రసం..
వ్యాయామం చేసే సమయంలో కోల్పోయిన ద్రావణాలను తిరిగి పొందాలంటే సరైన ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందులో 'సోరకాయ రసం' ఒకటి. బరువు తగ్గడానికి మంచిగా ఉపయోగ పడుతుంది. తక్కువ క్యాలరీలు అందించి..అధిక పీచును కలిగి ఉంటుంది. సొరకాయలో కార్పొహైడ్రైట్లు ఆకలిని తగ్గిస్తుంది. ఐరన్‌, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు కూడా ఈ సొరకాయ రసంలో ఎక్కువే. ఇది మూత్రాశయ సంబంధిత అన్ని రకాల ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది.

Don't Miss