కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్తున్నారా... ఒక్కసారి ఈ వార్త చదవండి...

21:29 - January 19, 2017

నెల్లూరు ప్రజావైద్యశాల డా.బ్రహ్మారెడ్డితో 10టివి సీవోవో ఎస్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ నిర్వహించారు. 'ఆర్యోగం..ఎమర్జెన్సీ' పై చర్చించారు. ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని విస్మరిస్తున్నాయన్నారు. స్టంట్ల ధరలను వినియోగదారుడు, ప్రభుత్వం నిర్ణయించలేదన్నారు. రక్త నాళాలు సన్నబడకుండా ఏం చేయాలని డాక్టర్లు చెప్పరు.. కానీ రక్తనాళాలు సన్నబడ్డాక వైద్యం చేస్తారు. సమాజం ఎంత దౌర్భాగ్యంగా మారితే.. కార్పొరేట్ వైద్యం అంత దౌర్భాగ్యంగా మారుతుందని చెప్పారు.  40వేల స్టంట్ ను కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షన్నరకు వేస్తున్నారని తెలిపారు. డాక్టర్లు సింపుల్ విషయాలు చెప్పకుండా డబ్బులు ఖర్చు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఇంజక్షన్ వేయడంలో 50 మెళకువలుంటాయని చెప్పారు. తల్లికి బిడ్డపై ప్రేమ ఉండాలి, బిడ్డకు పాలు ఇవ్వాలనే కోరిక ఉంటే.. తల్లికి పాలు పడుతాయని తెలిపారు. ప్రజా సంక్షేమంపై పెట్టే ఖర్చును ప్రభుత్వం అనవసరపు ఖర్చుగా భావిస్తుందని పేర్కొన్నారు. వైద్యాన్ని ప్రభుత్వం కార్పొరేట్ వైద్యశాలలకు వదిలేస్తున్నారు. ఇన్స్యూరెన్స్ కంపెనీ నష్టానికి పని చేయదు.. లాభానికి పని చేస్తోంది. రోగం నయం చేయడం కన్న రోగ నిరోధం మిన్నా అని అన్నారు. ప్రతి పౌరుడికి ప్రథమ చికిత్స చేయడం రావాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు డాక్టర్లకు టార్గెట్లు పెడుతున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Don't Miss