రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల...

08:25 - June 16, 2016

శరీర సౌష్టవం పెంచుకొనేందుకు..ఆరోగ్యం ఉండేందుకు మంచి ఆహారంతో పాటు వ్యాయామం తప్పనిసరి. వ్యాయామంలో కూడా స్కిప్పింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. ప్రతి రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకసారి స్కిప్పింగ్ చేసి ఫలితాలను చూడమంటున్నారు.
స్కిప్పింగ్ చేయడానికంటే ఐదు నిమిషాల ముందు వార్మప్ వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది.
రోజూ స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం ధృడత్వం ఉండడంతో పాటు పూర్తిస్తాయిలో ఫిట్ గా ఉంటుంది. ఎముకలు గట్టిపడుతాయి. చర్మపై ఏర్పడిన ముడతలు తొలగిపోతాయి.
శరీరంలోని అవయవాల కదలికను వేగవంతం చేయడంతో పాటు వాటి మధ్య సమన్వయానికి తోడ్పడుతుంది.
స్కిప్పింగ్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. పాదాలకు రక్షణ లేకుండా స్కిప్పింగ్ చేయడం వల్ల నొప్పి కలుగుతుంది. దీనితో పాటు పగుళ్లు కూడా ఏర్పడే అవకాశం ఉంది కనుక బూట్లు తప్పకుండా వేసుకోవాలి.
బరువు తగ్గించడంలో స్కిప్పింగ్ కీలక పాత్ర పోషిస్తుంటుంది. 

Don't Miss