చలికాలం..ఆరోగ్యం..

10:14 - December 30, 2016

చలికాలం రాగానే వివిధ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. .జలుబు, శ్వాసకోశ సంబంధ సమస్యలు సర్వసాధారణంగా మారుతుంటాయి. ఇంట్లో ఆహారం కాకుండా బయట ఫుడ్స్ తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. చలికాలంలో మరింతగా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని టిప్స్..

  • పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సిట్రస్ జాతికి చెందిన పండ్లు కూడా తీసుకోవాలి.
  • చలికాలంలో వ్యాయామాలు చేయాలి. శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరిగి వెచ్చగా ఉంటుంది. అంతేగాకుండా రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
  • చలికాలంలో ఎక్కువగా వేడి ఆహార పదార్థాలు భుజించాలి. పండ్లు..కూరగాయాలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.
  • చలికాలంలో పరిశుభ్రంగా ఉండాలి. తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం..తీసుకొనే ఆహారాన్ని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి.
  • చలికాలంలో చాలా మంది నీటిని ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడరు. దీనివల్ల శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. చర్మం పొడిగా కూడా మారుతుంది. దాహం కాకున్నా ఆరు నుండి ఎనిమిది గ్లాసుల నీరు తాగడం మంచిది.

Don't Miss