గర్భిణీలకు చాక్లెట్...

10:00 - May 11, 2016

గర్భం ధరిస్తే చాలు కుటుంబ సభ్యులు మొదలుకొని బంధువులు, స్నేహితులు అనునిత్యం అది తినూ ఇది తినూ అంటూ ఏదో ఒకటి తెస్తూ ఉంటారు. అయితే గర్భం దాల్చిన మహిళలు తప్పనిసరిగా తీసుకోవల్సిన ఆహారం ఏంటి? ఇంకేముంటుంది... పోషకాలు మెండుగా ఉండే పండ్లు తదితర ఆహారాన్ని తీసుకోవాలంటారా? అయితే అది నిజమే. ఆ ఆహారం తప్పనిసరే. కానీ దాంతోపాటు డార్క్ కలర్‌ చాకొలేట్స్ కూడా తినాలట. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? అవును, ఇది నిజమే. గర్భిణీ మహిళలు డార్క్ కలర్‌ చాకొలేట్స్ ను రోజుకొకటి చొప్పున మొదటి మూడు నెలల పాటు తగిన మోతాదులో తింటే వారికి పుట్టబోయే పిల్లలు అత్యంత సంతోషంగా ఉంటారట. పలువురు వైద్య నిపుణులు తాజాగా చేసిన పరిశోదనల్లో ఈ విషయం వెల్లడైంది. అందుకే గర్భిణీ మహిళలు డార్క్ చాకొలేట్స్ ను నిత్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు..

  • గర్భం దాల్చిన మహిళలు డార్క్ కలర్‌ చాకొలేట్స్ ను తింటే మంచిదని పైన చెప్పాం కదా! అయితే వాటిని తినబోయే ముందు గర్భిణీలు డయాబెటిస్‌ పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే చాకొలేట్స్ తినడం వల్ల డయాబెటిస్‌ పెరిగి పోయి ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
  • గర్భిణీ మహిళలకు తొలినాళ్లలో సాధారణంగా ప్రి-ఎక్లేంప్సియా అనే ఓ కండిషన్‌ వస్తుంటుంది. దీని వల్ల తల్లితోపాటు ఆమె కడుపులో ఉన్నబిడ్డకు కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంటుంది. ఇది ఇద్దరికీ ప్రమాదమే. అయితే మొదటి మూడు నెలల పాటు డార్క్‌ కలర్‌ చాకొలేట్స్‌ను తింటే ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు.
  • గర్భిణీ మహిళలకు థియోబ్రోమిన్‌ అనే పోషకం అత్యంత అవసరం. ఇది బీపీతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది. ఈ క్రమంలో డార్క్ చాకొలేట్స్ తినడం వల్ల థియోబ్రోమిన్‌ సరిగ్గా అంది అది బిడ్డతోపాటు తల్లి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
  • గర్భిణీలకు సాధారణ మహిళలతో పోలిస్తే రోగ నిరోధక శక్తి కొంత తగ్గుతుంది. ఈ క్రమంలో డార్క్‌ కలర్‌ చాకొలేట్స్‌ను తింటే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు బిడ్డతోపాటు తల్లి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
  • డార్క్ కలర్‌ చాకొలేట్స్ లో ఐరన్‌, మెగ్నిషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గర్భిణీ మహిళలకు, కడుపులో ఉన్న బిడ్డలకు అత్యంత అవసరమైనవిగా వైద్యులు చెబుతారు.
  • గర్భం దాల్చిన మహిళలు సహజంగానే నిత్యం ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు. ఈ సమయంలో వారు డార్క్ కలర్‌ చాకొలేట్స్ ను తింటే అది వారి మూడ్‌ను నియంత్రించి ఒత్తిడి తగ్గేలా చేస్తుంది. 

Don't Miss