గుండెలో 'రూ.90లక్షల పరికరం'..

15:51 - April 21, 2017

గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తే ఆపరేషన్ లు నిర్వహిస్తుంటారు. గుండె మార్పిడి సైతం చేసుకుంటుంటారు. కానీ ఇవన్నీ ఖరీదుతో కూడిన వ్యవహారం. కానీ ఓ వ్యక్తి మాత్రం తన గుండె బాగు చేయించుకోవడానికి ఏకంగా రూ. 90 లక్షల పరికరం పెట్టుకోవడంతో వార్తల్లోకి ఎక్కాడు. దోషి (49) అనే వ్యాపారికి ఐదేళ్ల క్రితం గుండె పోటు వచ్చింది. అంతే గాకుండా హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఏర్పడింది. దీనితో ఆసుపత్రులను సందర్శించాడు. గుండె మార్పిడి చేయించుకుంటే సరిపోతుంది..కానీ అతడికి టీబీ కూడా వ్యాధి ఉండడంతో ఖరీదైన పరికరం అమర్చుకోవాల్సి వచ్చింది. లెఫ్ట్ వెంట్రికుల్యర్ ఆసిస్ట్ డివైజ్ (ఎల్ వీఏడీ) అనే పరికరాన్ని ముంబైలోని ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు అమర్చారు. 9 నెలల క్రితం ఓ మహిళకు ఇదే పరికరం అమర్చినా ఆమె కన్నుమూసిందని, ప్రస్తుతం దోషికి జరిపిన చికిత్స విజయవంతమైందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఎల్ వీఏడీ అనేది కృత్రిమ గుండె కాదని, ఉన్న గుండెను మెరుగ్గా పనిచేయించడానికి ఉపయోగపడే పరికరం మాత్రమేనని వైద్యులు పేర్కొంటున్నారు.

Don't Miss