రానాకు జోడీగా బాలీవుడ్ నటి..

10:50 - June 5, 2018

విభిన్నమైన కథలను..విలక్షణమైన పాత్రలను ఎంచుకోటంలో రానా స్లైలే వేరు. రానాకు వివిధ భాషల్లో మంచి క్రేజ్ కూడా వుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రానా తన ఇమేజ్ ను నిలబెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటాడు. అటు దర్శక నిర్మాతలకు కూడా రానా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని బహుభాషా చిత్రాలను రూపొందించడానికే ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఇప్పుడు తాజాగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రానా చిత్రంగా 'హాథీ మేరే సాథీ' చిత్రం రూపొందుతోంది. హిందీతో పాటు తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం రానా బరువు కూడా తగ్గానని ట్విట్టర్ లో చెప్పారు. కాగా ఈ చిత్రం వన్యప్రాణి సంరక్షణ కథాశంగా రూపొందుతున్నట్లుగా సమాచారం. దీంట్లో గజరాజులదే ప్రధాన పాత్రగా కూడా తెలుస్తోంది. దీని కోసం రానా దాదాపు 18 రోజుల పాటు ఏనుగుల మధ్య గడిపాడని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి.

మూడు భాషలకు గాను తెలుగు టైటిల్ 'అరణ్య'..
తెలుగులో ఈ సినిమాకి 'అరణ్య' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో రానా సరసన కథానాయికగా బాలీవుడ్ నటి 'కల్కి కొచ్లిన్' నటిస్తోంది. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను ఆగస్టు నుంచి ప్లాన్ చేశారు. అడవుల్లో ఎక్కువభాగం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా, థియేటర్లకు ఎప్పుడు వస్తుందా అని రానా అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.    

Don't Miss