రోహిత్ సిక్స్ ప్యాక్..?

14:45 - July 14, 2017

నారా రోహిత్..పేరు చెప్పగానే అతని శరీరం గుర్తుకొస్తుంది. బొద్దుగా ఉండే రూపం ఠక్కున మెదలుతుంది. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటు ముందుకెళుతున్నాడు. కానీ అతని లుక్ విషయంలో పలు టాక్స్ వినిపించాయి. కానీ తన లుక్ ను మార్చుకోవడానికి నారా రోహిత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు అతడు నార్మల్ రూపంలోకి వచ్చాడని సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 'శమంతకమణి', ‘కథలో రాజకుమారి' సినిమాల్లో 'నారా రోహిత్' నటించిన సంగతి తెలిసిందే.

కొన్ని నెలల నుండి జిమ్ లో 'నారా రోహిత్' చెమటోడుస్తున్నాడంట. ఏకంగా 21 కిలోలు తగ్గిపోయాడని పుకార్లు వినిపిస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో తాను బరువు తగ్గినట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 'పవన్ మల్లెల' అనే కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమాలో 'రోహిత్' న్యూ లుక్ ఉంటుందని టాలీవుడ్ టాక్. ఇందులో 'రోహిత్' సిక్స్ ప్యాక్ తో కనబడుతాడని మరో టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు ‘వీరభోగ వసంతరాయలు’ అనే సినిమా కూడా చేస్తున్నాడు రోహిత్.

Don't Miss