'కణితన్' రీమెక్ ? నిఖిల్ హీరో ?

10:26 - May 18, 2017

టాలీవుడ్ హీరోల్లో ప్రయోగాత్మక చిత్రాలతో దూసుకపోతున్న నటుడు 'నిఖిల్'. తాజాగా ఆయన నటించిన 'కేశవ' చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో నిఖిల్ ఓ వైవిధ్యమైన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిఖిల్ 'కిర్రాక్ పార్టీ' సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ సినిమా రీమెక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. తమిళంలో అధర్వ హీరోగా రూపొందిన 'కణితన్' సినిమాను తెలుగులో రీమెక్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. కోలీవుడ్ లో ఈ సినిమాను డైరెక్ట్ చేసిన టి.ఎన్.సంతోష్ తెలుగులో కూడా డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుత్నునట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో 'నిఖిల్' అయితే కరెక్టు అని భావించిన డైరెక్టర్ ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బిబిసిలో రిపోర్టర్ గా పనిచేయాలని అనుకున్న కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో ఓ మర్డర్ కేసులో ఇరుక్కొంటాడు. ఆ కేసు నుండి ఎలా బయటపడ్డాడనే నేపథ్యంలో చిత్ర కథ ఉండనుంది. ప్రస్తుతం చర్చల దశల్లో ఉన్న ఈ ప్రాజెక్టు విషయాలు త్వరలో తెలియనున్నాయి.

Don't Miss