'నితిన్' కు కాసుల పంట...

15:36 - January 12, 2017

టాలీవుడ్ యువ హీరోల్లో ఒకరైన 'నితిన్' చిత్రం ఎలాంటి రాలేదు. కాసుల పంట పండడం ఏంటీ ? అని ఆశ్చర్యపోతున్నారా ? కానీ ఇది నిజం అంట. ఈ ఆనందాన్ని 'నితిన్' తన ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన 'బాలకృష్ణ' 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' గురువారం రిలీజైంది. ఈ సినిమాకు అభిమానుల నుండి భారీ స్పందనే వ్యక్తమౌతోంది. టాలీవుడ్ ప్రముఖులు..ఇతరులు 'బాలకృష్ణ' చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్ర నైజాం హక్కులను 'నితిన్' సొంతం చేసుకున్నాడు. సినిమా చారిత్రాత్మక విజయం సాధించిందని 'నితిన్' పోస్టు చేశాడు. అంతేగాకుండా 'బాలకృష్ణ'..'క్రిష్' కు అభినందనలు తెలిపాడు. బాలయ్య సినిమాపై నితిన్ భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఎలాంటి వసూళ్లు రాబడుతుందో ఆతృతగా ఎదురు చూశాడు. చిత్రానికి మంచి స్పందనే వస్తుండడంతో నితిన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయంట. మరి నైజాంలో ఎలాంటి కలెక్షన్లు సాధించిందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగితే తెలిసిపోతుంది.

Don't Miss