చెన్నైలో వాక్‌ ఫర్‌ మైల్‌...

18:57 - February 11, 2018

తమిళనాడు : మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు చెన్నైలో వుమెన్‌ వాక్ నిర్వహించారు. మహిళలపై గృహహింస, లైంగిక వేధింపులు, అత్యాచారాలను వ్యతిరేకిస్తూ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. వాక్‌ ఫర్‌ మైల్‌గా సాగిన ఈ కార్యక్రమంలో నటులు శరత్‌ కుమార్, హీరో సిద్ధార్థ్‌, బిందుమాధవితో పాటు 500 మంది యువతులు, మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును బాధిత మహిళలకు ఇవ్వనున్నట్లు నటి వరలక్ష్మి తెలిపారు. 

Don't Miss