రాజశేఖర్ తో చేయనన్న కాజల్..

14:48 - August 2, 2018

హిట్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ ఇప్పటికీ బిజీ బిజీగా వుంది. తేజా దర్శకత్వంలో లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగులో అరంగ్రేటం చేసిన కాజల్ అప్పటి నుండి తిరిగి చూసుకోలేదు. అగ్రకథానాయకులతోనే వరుస సినిమాలు చేస్తూ 10 సంవత్సరాల నుండి అగ్రహీరోయిన్ గా వెలుగొందుతోంది. హిట్ హీరోయిన్ గా పేరొందిన కాజల్ డేట్స్ కోసం నిర్మాతలు కూడా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో హిట్స్ లేక సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న హరో రాజశేఖర్ 'గరుడ వేగ'తో హిట్ అందుకున్నాడు. తరువాత సినిమా కూడా హిట్ కొట్టాలనే కసితో వున్నాడు. ఆ మధ్య కొంత గ్యాప్ వచ్చినా కాజల్ స్థాయికి తగిన అవకాశాలు మళ్లీ పెరగడం .. సక్సెస్ లు పలకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా రాజశేఖర్ సినిమా కోసం ఆమెను అడిగారట. అయితే కాజల్ నుంచి నో అనే ఆన్సర్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

'గరుడవేగ' హిట్ తరువాత..మంచి కథ కోసం రాజశేఖర్ గ్యాప్ తీసుకున్నారు. 'అ!' వంటి ప్రయోగాత్మక చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న ప్రశాంత్ వర్మ, ఇటీవలే ఒక విభిన్నమైన కథకు రాజశేఖర్ కనెక్ట్ అయ్యాడట. దీంతో ఈ సినిమా చేయడానికి రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ని అడిగితే డేట్స్ లేవని చెప్పడంతో, శ్రియను ఓకే చేసినట్టుగా సమాచారం.

Don't Miss