తమిళనాడును భయపెడుతున్న వర్షం...

13:22 - August 16, 2018

చిత్తూరు : తమిళనాడు రాష్ట్రాన్ని వర్షం భయపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన నాలుగు రోజుల నుండి వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. సముద్ర తీరం వెంబడి ఉన్న ప్రాంతాలు విలవిలలాడుతున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కావేరీ నది పరివాహక తీరం వెంబడి ఉన్న వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. కావేరీ పరివాహక ప్రాంతం, దక్షిణ తమిళనాడులో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కన్యాకుమారి, తేని, నమక్కల్ జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. 

Don't Miss