‘7 గంటలకు వస్తే ఇంకా ఓటేయ్యలే’...

11:30 - December 7, 2018

ఖమ్మం : ‘ఉదయం 7గంటలకు వచ్చినం..ఇంకా క్యూ లైన్‌లోనే ఉన్నం..ఇంకా ఓటేయ్యలే’..అంటూ ఖమ్మం ఓటర్లు పేర్కొంటున్నారు. డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్‌ కొనసాగుతోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ సమయాన్ని కుదించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు వినూత్న ఆలోచనలు అమలు చేశారు. ఆదర్శ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చే వికలాంగులకు గ్రీన్ కార్పెట్ ద్వారా స్వాగతం పలుకుతున్నారు. పలు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే..భారీగా ఓటర్లు తరలిరావడంతో చాంతాడంత క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. తాము ఉదయమే వచ్చినా ఇంకా ఓటు వేయలేదన్నారు. ఉదయం 7గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ ఈవీఎంలు మొరాయించడం...మాక్ పోలింగ్ లేటుగా నిర్వహించడంతో...పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో భారీగానే ఓటింగ్ శాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. 

Don't Miss