నిండు కుండ కడెం ప్రాజెక్టు..

11:37 - August 29, 2017

నిర్మల్ జిల్లా : కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారిపోయింది. భారీగా వరదనీరు పోటెత్తుతోంది. మహారాష్ట్ర..ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో కడెం ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులుగా ఉండగా ప్రస్తుతం 698 అడుగులకు చేరుకుంది. ముందస్తుగా గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు వదిలారు. ఇన్ ఫ్లో 12.31 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 13.41 క్యూసెక్కులుగా ఉంది. 12 ఫీట్ల మేర గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎడమ కాల్వ నుండి 907 క్యూసెక్కులు, కుడి కాల్వ నుండి 19 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..గోదావరి నదిలోకి దిగవద్దని హెచ్చరించారు.

Don't Miss