సంగారెడ్డిలో రెచ్చిపోయిన దుండగులు

11:52 - December 28, 2016

సంగారెడ్డి : జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. పట్టపగలే ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి చొరబడి భారీ దోపిడీ చేశారు. ఆర్సీపురం మండలం బీరంగూడ కమాన్ వద్ద ముంబాయి జాతీయ రహదారి పక్కనున్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయ సిబ్బందిని రివాల్వర్‌తో బెదిరించి కార్యాలయంలోని రూ.8 కోట్ల 22 లక్షల విలువైన బంగారం అపహరించుకుని పోయారు. స్కార్పియోలో ఐదుగురు దుండగులు వచ్చారని సిబ్బంది చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూడండి.

Don't Miss