చెరువుల ప్రక్షాళనకు ప్రత్యేక ట్రంక్‌ లైన్‌ ఏర్పాటు చేయాలి : నాగేశ్వర్‌

16:40 - July 8, 2018

హైదరాబాద్ : చెరువులను ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లో 50 కాలనీవాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాలుష్యం నుంచి చెరువులను,... రోగాల నుంచి తమను రక్షించాలని కోరుతూ ఐదువేల మంది కాలనీవాసులు ఆందోళన బాట పట్టారు. ర్యాలీలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం మీర్‌పేట్‌, ఆల్మాస్‌గూడా కమాన్‌ నుంచి మంద మల్లమ్మ ఫంక్షన్‌ హాల్‌ వరకు ర్యాలీ కొనసాగింది. డ్రైనేజీలకు ప్రత్యేక ట్రంక్‌లైన్‌ ఏర్పాటు చేయాలని నాగేశ్వర్‌ కోరారు. హైదరాబాద్‌ను గ్లోబల్‌సిటీగా మార్చాలనుకుంటున్న సర్కార్‌.. చెరువులను ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు.

 

Don't Miss