సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం...

06:40 - April 15, 2018

ఢిల్లీ : ఐపీఎల్‌ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా అతిథ్య జట్టు కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో హైదరాబాద్‌ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. కోల్‌కతా నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సైన్‌రైజర్స్‌ ఇంకా ఒక ఓవర్‌ మిగిలిఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. హైదరాబాద్‌ జట్టు సారథి కేన్‌ విలియమ్‌సన్‌ 55 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

Don't Miss