గ్యాంగ్ స్టర్ నయీంపై సినిమా తీస్తా : రాంగోపాల్ వర్మ

ముంబై వీరప్పన్‌ సినిమా తీసి అందరినీ మెప్పించిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.. గ్యాంగ్‌స్టర్‌ నయీం జీవిత కథను తెరకెక్కిస్తానని చెబుతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. నయీం గురించి ఎన్నో కథనాలు చదివి తెలుసుకున్నానని ఆయన చెప్పారు. నయీం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.. పెద్ద సినిమానే తీయాలని ఆయన అభిప్రాయాపడ్డారు. త్వరలో నయీంపై సినిమా తీస్తానని...అది మూడు భాగాల్లో తెరకెక్కిస్తానని వెల్లడించారు. 

Don't Miss