లక్నోలో ఐఏఎస్‌ అధికారి అనుమానాస్పద మృతి

14:50 - May 17, 2017

హైదరాబాద్: కర్ణాటక కేడర్‌కు చెందిన ఓ ఐఏఎస్‌ అధికారి లక్నోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హజ్రత్‌జంగ్‌ మీరాబాయి గెస్ట్‌హౌస్‌ సమీపంలోని రోడ్డు పక్కన అనురాగ్‌ తివారీ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒంటిపై ఉన్న గుర్తులతో పాటు ఘటనా స్థలంలో లభించిన ఐడీ కార్డు ఆధారంగా ఐఏఎస్‌ అధికారి అనురాగ్‌ తివారీగా పోలీసులు గుర్తించారు. గత రెండు రోజులుగా ఆయన మీరాబాయి అతిథిగృహంలోనే ఉంటున్నారు. యూపీలోని బహర్చికి చెందిన తివారి 2007లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Don't Miss