అట్టహాసంగా ఐపీఎల్ 2018 వేలం

13:11 - January 27, 2018

ఢిల్లీ : అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్‌-2018 వేలానికి తెరలేచింది. వేలానికి వచ్చిన మొదటి ఆటగాడు శిఖర్‌ ధావన్‌. ఆ తర్వాత రవిచంద్రన్‌ అశ్విన్‌, కీరన్‌ పొలార్డ్‌, క్రిస్‌ గేల్‌, బెన్‌ స్టోక్స్‌ వచ్చారు. టీ20 విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌, వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్‌ గేల్‌ను కొనుగోలు చేసుకునేందుకు ఏ ఒక్క ఫ్రాంఛైజీ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. గత ఏడాది ఐపీఎల్‌ వేలంలో రూ.14.5 కోట్లకు అమ్ముడుపోయిన స్టోక్స్‌ ఈ ఏడాది ఆ స్థాయి ధర పలకలేదు. రూ.12.5 కోట్లకే రాజస్థాన్‌ రాయల్స్‌ స్టోక్స్‌ను సొంతం చేసుకుంది.కనీస ధర రూ.2కోట్లతో ధావన్‌ వేలానికి వచ్చాడు. అయితే ధావన్‌ కోసం రాజస్థాన్‌ రాయల్స్‌-కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ పోటీపడ్డాయి. మధ్యలో ముంబయి ఇండియన్స్‌ కూడా పోటీలోకి వచ్చింది. చివరికి రూ.5.2 కోట్లకు కింగ్స్‌ ఎలెవన్‌ అత్యధిక ధర వెచ్చించింది. అయితే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు రైట్‌ టు మ్యాచ్‌ కార్డు అవకాశం ఉండటంతో అదే మొత్తంతో ధావన్‌ను తిరిగి సొంతం చేసుకుంది.

 

Don't Miss