కోల్‌కతా నైట్‌రైడర్స్‌ @ ప్లేఆఫ్‌..

07:13 - May 20, 2018

హైదరాబాద్ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్‌కు చేరింది. సన్‌రైజర్స్‌తో జరిగిన తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ విజయం సాధించి ప్లేఆఫ్‌ బెర్తును ఖాయం చేసుకుంది. హైదరాబాద్‌, చెన్నైల తర్వాత ప్లేఆఫ్‌కు చేరిన మూడో జట్టుగా కోల్‌కతా నిలిచింది. హైదరాబాద్‌ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్‌ విజయంలో క్రిస్‌ లిన్‌, రాబిన్‌ ఉతప్పలు కీలక పాత్ర పోషించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, శ్రీవాత్స్‌ గోస్వామి శుభారంభాన్ని అందించిన.. చివరి నాలుగు ఓవర్లలో వరసగా వికెట్లు కోల్పోవటంతో సన్‌రైజర్స్ అనుకున్నంతా రన్స్‌ చేయలేకపోయింది.

Don't Miss