రాజస్తాన్‌ పై కోల్ కతా విజయం

08:58 - May 16, 2018

కోల్ కతా : ఐపీఎల్‌ మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్లేఆఫ్స్‌ దిశగా అడుగు వేసింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు చేసిన రాజస్తాన్‌ 19 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది. స్పీన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ చెలరేగడంతో రాజస్థాన్‌ 142 పరుగులకే పరిమితమయింది. అనంతరం కోల్‌కతా 18 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసింది. క్రిస్‌ లిన్‌, దినేశ్‌ కార్తీక్‌లు కీలక ఇన్నింగ్స్‌ ఆడడంతో నైట్‌రైడర్స్ విజయాన్ని అందుకుంది. ఈ ఓటమితో రాజస్థాన్‌ ప్లే ఆఫ్ అవకాశాలు సక్లిష్టంగా మారాయి. నాలుగు కీలక వికెట్లు తీసి.. కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్‌ యాదవ్..  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డ్‌ అందుకున్నాడు.

 

Don't Miss