ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై పంజాబ్‌ విన్‌

09:48 - April 24, 2018

ఢిల్లీ : ఐపీఎల్‌ 11లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మరో పరాజయం ఎదురైంది. రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఢిల్లీకి ఇది ఐదో ఓటమి.   మరోవైపు పంజాబ్‌ వరుసగా 4వ విజయం సాధించింది. టార్గెట్‌ చిన్నదైనా కీలక వికెట్లు చేజారడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. పంజాబ్‌ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఏ దశలోనూ నిలబడలేకపోయింది. స్వల్ప పరుగులకే టాప్ ఆర్డర్‌ కుప్పకూలింది. దీంతో ఐదో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

 

Don't Miss