నేడే ఐపీఎల్ ఫైనల్

07:45 - May 21, 2017

హైదరాబాద్ : ధనా ధన్‌ ట్వంటీ ట్వంటీ లీగ్‌...ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 10వ సీజన్‌ క్లైమాక్స్‌ ఫైట్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ముంబై ఇండియన్స్‌ , పటిష్టమైన రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్‌ జట్ల మధ్య అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య టైటిల్‌ ఫైట్‌...క్రికెట్‌ అభిమానులకు ఇంతకు మించి కావాల్సిందేముంటుంది. గత సీజన్‌లో పాయింట్స్‌ టేబుల్‌ ఆఖరి స్థానానికే పరిమితమైన రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్‌ జట్టు...ఈ సీజన్‌లో అంచనాలకు మించి అదరగొట్టింది. ఎక్స్‌పెక్టేషన్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా అదరగొట్టిన పూణే జట్టు ఫైనల్‌కు అర్హత సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది.ఐపీఎల్‌ 10వ సీజన్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శించిన జట్టు ముంబై ఇండియన్స్‌ జట్టు 4వ సారి ఫైనల్‌కు అర్హత సాధించింది.అంబటిరాయుడు, పార్థీవ్‌ పటేల్‌, నితీష్ రానా, రోహిత్‌ శర్మ, కీరన్ పోలార్డ్ , లెండిల్‌ సిమ్మన్స్‌, కృనాల్‌ పాండ్య, హార్దిక్ పాండ్య వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌తో పాటు ...మిషెల్‌ జాన్సన్‌,మలింగా, హర్భజన్‌ సింగ్‌,కరణ్‌ శర్మ వంటి బౌలర్లతో ముంబై జట్టు ఎప్పటిలానే పవర్‌ఫుల్‌గా ఉంది.

ఆరంభ మ్యాచ్‌ల్లో తడబడ్డ పూణే 
ఆరంభ మ్యాచ్‌ల్లో తడబడ్డ పూణే జట్టు...చివరి 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి టైటిల్‌ రేస్‌లో నిలిచింది.తొలి క్వాలిఫైయర్‌లో ముంబై జట్టునే ఓడించి ఫైనల్‌లో ఎంటరైంది. స్టీవ్‌స్మిత్‌, రహానే,రాహుల్‌ త్రిపాఠీ, ధోనీ,వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌తో పాటు....డానియల్‌ క్రిస్టియన్‌ వంటి హార్డ్‌ హిట్టింగ్‌ ఆల్‌రౌండర్‌తో పూణే బ్యాటింగ్‌ బలంగా ఉంది. జయదేవ్‌ ఉనద్కత్‌ 11 మ్యాచ్‌ల్లోనే 22 వికెట్లు తీసి పూణే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కానీ ఫేస్ టు ఫేస్‌ రికార్డ్‌లో మాత్రం పూణె జట్టుదే పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ముంబై ఇండియన్స్‌తో 5 సార్లు పోటీపడిన పూణె జట్టు 4 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ప్రస్తుత సీజన్‌లో ముంబై జట్టును మూడు సార్లు ఓడించిన పూణే జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నా....ఆల్‌రౌండ్‌ పవర్‌తో పవర్‌ఫుల్‌గా ఉన్న రోహిత్‌ సేనను తక్కువ అంచనా వేయలేం. మరి రెండు సార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌,తొలి సారి ఫైనల్‌ ఆడబోతోన్న రైజింగ్‌ పూణె సూపర్ జెయింట్‌ జట్లలో ఐపీఎల్ టైటిల్‌ నెగ్గే జట్టేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్‌ చేయాల్సిందే.

 

Don't Miss