ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ గెలుపు

07:49 - May 5, 2018

మొహాలీ : మొహాలీ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ జట్టు సమయంలో సత్తా చాటింది. పంజాబ్‌ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 175 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆ జట్టు 19 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 57,  కృనాల్‌ పాండ్య  31 పరుగులు చేసి ముంబై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు    క్రిస్‌ గేల్‌ 50,  స్టాయినిస్‌ 29 పరుగులతో రాణిచడంతో పంజాబ్‌ కింగ్స జట్టు 20ఓవర్లలో  6 వికెట్లకు 174 పరుగులు చేసింది. టార్గెట్‌ ఛేదనలో ముంబైకి సూర్యకుమార్‌ మంచి ఆరంభాన్నిచ్చాడు. పది పరుగులతో  లూయిస్‌ ఔట్‌ అయినా  సూర్యకుమార్‌ వెనక్కు తగ్గలేదు. ఫోర్లు, సిక్క్‌లు బాదేస్తు 57 రన్స్ చేశాడు. ఇషాన్‌ కిషన్‌ 25 పరుగులు చేసి అలరించాడు. స్టాయినిస్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌ ఔటయ్యాడు .  తర్వాత   ఇషాన్‌ను ముజీబ్‌ రెహ్మాన్‌ పెవిలియన్‌కు పంపాడు. ఈసమయంలో  ముంబైజట్టుపై ఒత్తడి పెరిగింది. 4 ఓవర్లలో 50 పరుగులు చేయాల్సి  రావడంతో ఉత్కంఠ నెలకొంది.  ఐతే కృనాల్‌ పాండ్య ..పంజాబ్‌ బౌలర్లను ఓ  ఆట ఆడుకున్నాడు. వరుసగా బౌండరీలు బాదేస్తూ ముంబయికి సునాయాస విజయాన్నందించాడు. సూర్యకుమార్‌కు మాన్యా ఆఫ్‌ ద మ్యాచ్‌ లభించింది. ఈ విజయంతో   ప్లేఆఫ్‌ ఆశలను ముంబైఇండియన్స్  సజీవంగా నిలుపున్నారు.  

 

Don't Miss