ఢిల్లీ డేర్‌ డెవిల్స్ మరో విజయం

09:19 - May 3, 2018

ఢిల్లీ : ఐపీఎల్‌లో ఢిల్లీడేర్‌ డెవిల్స్‌ మరో విజయం సాధించింది. టాస్‌ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీజట్టు 4 పరుగులతో రాజస్థాన్‌పై విక్టరీ కొట్టింది. రిషబ్‌ పంత్‌ 69 , శ్రేయస్‌ అయ్యర్‌ 50,  పృథ్వీషా  47  రన్స్‌తలో  చెలరేగారు. దీంతో 17.1 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయిన ఢిల్లీటీమ్‌..  196 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం రాజస్తాన్‌ లక్ష్యాన్ని 12 ఓవర్లకు 151 పరుగులుగా నిర్ధేశించారు. లక్ష్యఛేదనలో రాజస్తాన్‌  ప్లేయర్లు జోరుగా బ్యాటింగ్‌ ప్రారంభించారు. ఓపెనర్లుగా  వచ్చిన  జోస్‌ బట్లర్‌, డీఆర్కీషార్ట్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. జోస్‌ బట్లర్‌  26 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 67 పరుగులు .. డీఆర్కీషార్ట్‌ 26 బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 రన్స్‌ చేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్‌లు దూకుడుగా ఆడే క్రమంలో వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. దీంతో నిర్ణీత ఓవర్లలో 12 ఓవర్లలో  రాజస్తాన్‌ రాయల్స్‌ 5వికెట్లు కోల్పోయి 146 పరుగు మాత్రమే  చేసింది. ఢిల్లీ బౌలర్లలో బౌల్ట్‌ రెండు వికెట్లు.. అమిత్‌ మిశ్రా, మ్యాక్స్‌వెల్‌లకు చెరో వికెట్‌ దక్కాయి. బట్లర్‌, డీఆర్కీషార్ట్‌  వీరోచితంగా ఆడినా రాజస్తాన్‌ రాయల్స్‌కు  ఓటమి తప్పలేదు. 

 

Don't Miss