ఐపీఎల్‌లో బెంగళూరు మళ్లీ గెలుపు బాట

08:21 - May 2, 2018

బెంగళూరు : ఐపీఎల్‌లో బెంగళూరు మళ్లీ  గెలుపు బాట పట్టింది. రెండు ఓటముల తర్వాత పుంజుకున్న ఆర్‌సీబీ జట్టు.. చక్కని బౌలింగ్‌తో ముంబయి ఇండియన్స్‌ను చిత్తు చేసింది. మూడో విజయంతో పాయింట్ల పట్టికలో కోహ్లీసేన ఐదో స్థానానికి చేరుకుంది.  ఆరో ఓటమితో  ప్లేఆఫ్‌ అవకాశాలను ముంబైజట్టు  దూరం చేసుకుంది.  చక్కని  బౌలింగ్‌తో ఆకట్టుకున్న  కోహ్లీబ్యాచ్‌ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్‌పై విజయం సాధించింది. మనన్‌ వోహ్రా 31 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 45 రన్స్‌ చేయగా.. బ్రెండన్‌ మెక్కలమ్‌  25 బంతుల్లో 4ఫోర్లు,  2 సిక్స్‌లు బాదేసి 37 పరుగులు చేశాడు. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు టీమ్‌.. నిర్ణీత 20ఓవర్లలో 7వికెట్లకు 167 పరుగులు చేసింది. తర్వాత టార్గెట్‌ ఛేదనలో ముంబై ఇండియన్స్‌ జట్టు తడబడింది. మొదటి నాలుగు ఓవర్లలో 24 రన్స్‌ మాత్రమే చేసి 3వికెట్లు కోల్పోయిన ముంబై కష్టాల్లో పడింది.   ఆర్‌సీబీ బౌలర్లు ఉమేశ్‌ యాదవ్‌ 2, సౌథీ 2, మహ్మద్‌ సిరాజ్‌ 2 వికెట్లు తీశారు. బెంగళూరు కట్టుదిట్టమై బౌలింగ్‌తో రోహిత్‌ సేన  పరుగుల వేటలో వెనుబడింది. 20 ఓవలర్లలో 7 వికెట్లకు 153 పరుగులు మాత్రమే చేయడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ముంబై బ్యాట్స్‌మన్లలో  50 పరుగులు చేసిన హార్దిక్‌ పాండ్య టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

Don't Miss