ఎవరికి ఓటు వేశానో చెప్పిన రోజా...
14:31 - July 17, 2017
గుంటూరు : ఏపీలో రాష్ట్రపతి ఎన్నికలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలోని అసెంబ్లీలో వైసీపీ నేత జగన్ ఎమ్మెల్యేలతో కలిసి రోజా తొలి సారిగా ఓటు వేశారు. జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్టు గా బీజేపీ బలపరిచిన అభ్యర్ధి రామ్‌నాథ్ కోవింద్‌కి ఓటు వేసినట్టు తెలిపారు.. తొలిసారిగా రాష్ట్రపతికి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు..స్పీకర్ కోడెల శివప్రసాదరావు ముఖ్యమంత్రితో కలిసి మాక్ ఓటింగ్‌లో పాల్గొనడం స్పీకర్ పదవికే అవమానకరం అని రోజా అన్నారు.