సొంత గడ్డపై మరోపోరుకు టీమిండియా

09:43 - February 17, 2017

టెస్ట్‌ ఫార్మాట్‌లో తిరుగులేని టీమిండియా సొంత గడ్డపై మరో సమరానికి సన్నద్ధమైంది.ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లోని రెండు టెస్ట్‌లకు భారత జట్టును బీసిసిఐ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. టెస్టుల్లో తిరుగులేని కొహ్లీ అండ్‌ కో కంగారూలతో టెస్ట్‌ సిరీస్‌లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది.

ఆస్ట్రేలియా తో నాలుగు మ్యాచ్ లు...

ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లోని రెండు టెస్ట్‌లకు భారత జట్టును బీసిసిఐ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ ఎంఎస్ కె ప్రసాద్‌ సారధ్యంలోని బీసిసిఐ సెలక్షన్‌ ప్యానెల్‌ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేశారు.

అమిత్‌ మిశ్రాను పక్కన పెట్టిన సెలక్టర్లు ...

గాయపడిన సీనియర్‌ లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రాను పక్కన పెట్టిన సెలక్టర్లు కుల్దీప్‌ యాదవ్‌ను ఎంపిక చేశారు. కుల్దీప్‌ యాదవ్‌ మినహా...బంగ్లాదేశ్‌ సింగిల్‌ టెస్ట్‌లో ఆడిన జట్టునే ఎంపిక చేశారు.తొలి రెండు టెస్ట్‌లకు జట్టులో చోటు దక్కించుకొన్న ఆటగాళ్ళలో విరాట్‌ కొహ్లీ,మురళీ విజయ్‌, కె ఎల్‌ రాహుల్, చతేశ్వర్ పూజారా,అజింక్యా రహానే, కరుణ్‌ నాయర్‌,అభినవ్‌ ముకుంద్‌, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్‌ శర్మ,హార్దిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌,రవీంద్ర జడేజా, జయంత్‌ యాదవ్‌,ఉమేష్‌ యాదవ్‌ , భువనేశ్వర్‌ కుమార్‌ ,కుల్దీప్‌ యాదవ్‌ ఉన్నారు.

టెస్ట్‌ ఫార్మాట్‌లో ఎంతలా ఆధిపత్యం ప్రదర్శిస్తోందో ....

టాప్‌ ర్యాంకర్‌ టీమిండియాకు టెస్ట్‌ ఫార్మాట్‌లో ఎంతలా ఆధిపత్యం ప్రదర్శిస్తోందో అందరికీ తెలిసిందే. టెస్టుల్లో కొహ్లీ అండ్‌ కో వరుసగా శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌ జట్లపై ఓటమంటూ లేకుండా సిరీస్‌ విజయాలు సాధించింది. టెస్టు ఫార్మాట్‌లో గత 19 మ్యాచ్‌ల్లో ఓటమంటూ లేకుండాభారత జట్టు 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లోని తొలి టెస్ట్‌ 23న ఆరంభమవుతుంది. కంగారూలతో మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న టెస్ట్ సమరంలో కొహ్లీసేనకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

Don't Miss