ఆస్ట్రేలియాకు ధీటుగా బదులిచ్చిన భారత్‌

21:59 - March 18, 2017

రాంచీ : రాంచీ టెస్ట్‌ మూడో రోజు భారత్‌ పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. పుజార ఫైటింగ్‌ సెంచరీ, విజయ్‌ హాఫ్‌ సెంచరీలతో ఆస్ట్రేలియాకు భారత్‌ ధీటుగా బదులిచ్చింది. 120 పరుగులకు ఒక వికెట్‌తో మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన భారత్‌....కంగారూ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. విజయ్‌,పుజార సెంచరీ భాగస్వామ్యంతో భారత్‌ను పోటీలో నిలిపారు. విరాట్‌ కొహ్లీ విఫలమైనా....క్రీజ్‌లో పాతుకుపోయిన పుజారా...రహానే,కరుణ్‌నాయర్‌తో కీలక భాగస్వామ్యాలు జోడించాడు. టెస్టుల్లో 11వ సెంచరీ పూర్తి చేసిన పుజారా....ఫైటింగ్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్‌ 6 వికెట్లకు 360 పరుగుల స్కోర్ నమోదు చేసింది. కంగారూ బౌలర్లలో ప్యాట్‌ కమిన్స్‌ 4 వికెట్లు తీయగా హేజిల్‌వుడ్‌,ఒకీఫ్‌ చెరో వికెట్‌ తీశారు.  

 

Don't Miss