ముంబై టెస్ట్.. భారత జట్టు ఆధిపత్యం

ముంబై టెస్ట్ మూడో రోజు ఆటలో ఆతిధ్య భారత జట్టు పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి రెండు రోజులు ఇండియాకు గట్టి పోటీనిచ్చిన ఇంగ్లండ్ ...మూడో రోజు మాత్రం భారత బ్యాట్స్‌మెన్ జోరు ముందు తేలిపోయింది. ఒక వికెట్ నష్టానికి 146 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన భారత్....మురళీ విజయ్,విరాట్ కొహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌తో పోటీలో నిలిచింది.విరాట్,పుజారాలతో కలిసి సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన విజయ్ ...231 బంతుల్లో టెస్టుల్లో 8వ సెంచరీ పూర్తి చేశాడు. 136 పరుగులకు విజయ్ ఔటైనా... మరో ఎండ్‌లో క్రీజ్‌లో పాతుకుపోయిన కొహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సూపర్ సెంచరీ నమోదు చేశాడు. లోయర్ ఆర్డర్లో జడేజా,జయంత్ యాదవ్‌లతో హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు జోడించిన కొహ్లీ...టెస్టుల్లో 15వ సెంచరీ నమోదు చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి భారత జట్టు 7 వికెట్లకు 451 పరుగులు చేసింది.విరాట్ 147, జయంత్ 30 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ,ఆదిల్ రషీద్, జో రూట్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం 51 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు.... తొలి ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు పైగా ఆధిక్యం సాధిస్తేనే మ్యాచ్‌పై పట్టు బిగించగలుగుతుంది.