సౌతాఫ్రికా, భారత్‌ అఖరి టెస్ట్‌

09:46 - January 24, 2018

ఢిల్లీ : టెస్ట్‌ టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా...దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్ట్‌కు సన్నద్ధమైంది. వాండరర్స్ ఫాస్ట్‌ అండ్‌ బౌన్సీ పిచ్‌పై భారత బ్యాటింగ్‌కు దక్షిణాఫ్రికా బౌలింగ్‌కు మధ్య ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. తొలి రెండు టెస్ట్‌ల్లో  తేలిపోయిన టీమిండియా ఆఖరి టెస్ట్‌లో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.సెకండ్‌ టెస్ట్‌తోనే సిరీస్‌ దక్కించుకున్న సఫారీ టీమ్‌ కొహ్లీ సేనపై క్లీన్‌ స్వీప్‌ సాధించాలని తహతహలాడుతోంది. 
మూడో టెస్ట్‌కు వాండరర్స్‌లో రంగం సిద్ధం 
భారత్‌-దక్షిణాఫ్రికా మూడో టెస్ట్‌కు వాండరర్స్‌లో రంగం సిద్ధమైంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్న సౌతాఫ్రికా...ఆఖరి టెస్ట్‌లోనూ భారత్‌కు అసలే మాత్రం అవకాశమిచ్చేలా లేదు. తొలి రెండు టెస్ట్‌ల్లో  తేలిపోయిన టీమిండియా ఆఖరి టెస్ట్‌లో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.సెకండ్‌ టెస్ట్‌తోనే సిరీస్‌ దక్కించుకున్న సఫారీ టీమ్‌ కొహ్లీ సేనపై క్లీన్‌ స్వీప్‌ సాధించాలని తహతహలాడుతోంది. 
బ్యాటింగ్‌లో భారత్ దారుణంగా విఫలం  
టెస్టు టాప్‌ ర్యాంకర్‌ టీమిండియా రెండు టెస్ట్‌ల్లోనూ బౌలింగ్‌లో అంచనాలకు మించి రాణించినా....బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది.  విరాట్‌,పుజారా,విజయ్‌,ధావన్‌ ,రోహిత్‌ శర్మ వంటి టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌ ఉన్నా స్వల్ప లక్ష్యాలను కూడా చేధించలేక చేతులెత్తేసింది.సఫారీ పేస్‌ బౌలర్లను చెక్‌ పెట్టడంలో భారత బ్యాట్స్‌మెన్‌ విఫలమవుతూనే ఉన్నారు.
సౌతాఫ్రికా రెట్టించిన ఉత్సాహం
మరోవైపు సౌతాఫ్రికా జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తోంది. భారత్‌పై క్లీన్‌ స్వీప్‌ సాధించడమే లక్ష్యంగా దక్షిణాఫ్రికా జట్టు బరిలోకి దిగనుంది.బ్యాటింగ్‌లో అంతంతమాత్రంగానే రాణిస్తోన్నా....వెర్నోర్‌ ఫిలాండర్‌, మోర్నీ మోర్కెల్‌, కగిసో రబడ, లుంగి నంగ్డీ వంటి టాప్‌ క్లాస్‌ పేస్‌ బౌలర్లు సమిష్టిగా చెలరేగుతుండటంతో సఫారీ టీమ్‌కు తిరుగేలేకుండా పోయింది.ఆఖరి టెస్ట్‌లోనూ పేస్‌ బౌలింగ్‌తోనే భారత్‌ను బోల్తా కొట్టించాలని సఫారీ టీమ్‌ ప్లాన్‌లో ఉంది.
టెస్ట్‌ రికార్డ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా పై చేయి 
టెస్ట్‌ ఫేస్‌ టు ఫేస్ రికార్డ్‌లోనూ భారత్‌పై సౌతాఫ్రికా జట్టుదే పై చేయిగా ఉంది. ఇప్పటివరకూ ఇరు జట్లు 35 టెస్టుల్లో పోటీ పడగా.....దక్షిణాఫ్రికా జట్టు 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.భారత్‌ 10 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. వాండరర్స్ ఫాస్ట్‌ అండ్‌ బౌన్సీ పిచ్‌పై దక్షిణాఫ్రికా పేస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను ఎదుర్కోవడం భారత బ్యాట్స్‌మెన్‌కు పెద్ద సవాలే అనడంలో అనుమానమే లేదు.

Don't Miss