మనకీ వుందో 'తామ్ లుయాంగ్'..

17:39 - July 12, 2018

మేఘాలయ : థాయ్‌లాండ్‌లోని తామ్‌ లుయాంగ్‌ గుహ ప్రపంచ వ్యాప్తంగా సెస్సేషన్ గా మారిపోయింది. ఆ గుహలో చిక్కుకున్న 12మంది చిన్నారులతో పాటు మొత్తం కోచ్ తో కలిపి మొత్తం 13మందిని రక్షించేందకు అధికారు పడిన శ్రమ..చూపిన తెగువ, అంకిత భావం ప్రపంచ వ్యాప్తంగా అందరి మనస్సులను గెలుచుకుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అందరిని సురక్షితంగా తీసుకురావటంతో అందరు ఆనందంగా ఊపిరి పీల్చుకున్నారు. శ్రమపడిన అధికారుల, డైవర్లు తమ శ్రమను మరిపోయి ఆనందం పడ్డారు. మరి థాయ్‌లాండ్‌లోని తామ్‌ లుయాంగ్‌ గుహలాంటి గుహ మన భారత దేశంలో కూడా వుందట. మేఘాలయలో ఇటీవలే అలాంటి ఒక గుహను కనుగొన్నారు. ప్రపంచలోనే అతి పొడవైన ఇసుకరాయి గుహగా అది గుర్తింపు పొందింది. మరి ఆ గుహ విశేషాలేమిటో చూద్దాం..

మేఘాలయలో క్రెంపురి గుహ అడ్వెంచర్‌ అసోసియేషన్‌ సాహసయాత్ర...
ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో క్రెంపురి అనే గుహ ఉంది. దీని పొడవు 24.5 కి.మీ. ఈ గుహను 2016లో కనుగొన్నారు. మాసిన్రామ్‌ ప్రాంతంలో ఉన్న గుహ అతి పొడవైన శాండ్‌స్టోన్‌ కేవ్‌గా గుర్తింపు పొందింది. గుహ పొడవెంతో తెలుసుకోవడానికి మేఘాలయ అడ్వెంచర్‌ అసోసియేషన్‌ సాహసయాత్రను చేపట్టింది. వివిధ దేశాలకు చెందిన 30 మందితో కూడిన కేవర్స్‌ అంటే గుహల అన్వేషకులు. ఈ అన్వేషన్ బృందం సుమారు నెల రోజుల పాటి శ్రమించి గుహ పొడవెంతో కనుగొంది.

గుహ లోపల డైనోసార్‌ అవశేషాలను గుర్తించిన అన్వేషకులు..
గుహలో రహస్యాలు తెలుసుకోవడానికి వెళ్లిన బృందానికి అనేక ఆసక్తికర అంశాలు కనిపించాయి. గుహ లోపల డైనోసార్‌ అవశేషాలను గుర్తించారు. అవి కొన్ని వేల ఏళ్ల క్రితం నాటివని శాస్త్రవేత్తలు తేల్చారు. డైనోసార్లు ఆ గుహ లోపల తలదాచుకునేవని, వాటి శిలాజాలే ఇప్పుడు లభించాయని అన్వేషకుల బృందం భావిస్తుస్తోంది.

అవగాహన లేకుండా లోపలకు వెళ్లవద్దని సూచించిన అన్వేషకుల బృందం
ఈ గుహ లోపలకు పొరపాటున ఎవరైనా వెళితే మళ్లీ వెనక్కి రావడం కష్టం. ఎందుకంటే దారంతా గజిబిజిగా, ఒక్కో చోట ఇరుకుగా ఉంటుంది. అక్కడక్కడా నీటి ప్రవాహాలు ఉన్నాయి. దారి మరిచిపోతే బయటపడటం కష్టమేనని కేవర్స్‌ బృందం వెల్లడించింది. పిల్లలూ... గుహల గురించి అవగాహన లేకుండా లోపలకు వెళ్లడం ప్రమాదకరమని అన్వేషకులు హెచ్చరించారు. 

Don't Miss