ఈ ఫొటో చూసి చలించిన గౌతమ్ గంభీర్..

06:42 - September 6, 2017

ఢిల్లీ : భారత సైనిక దళాల కుటుంబాల పట్ల తనకున్న నిబద్ధత, మానవత్వాన్ని తరచు చాటుకుంటూ వస్తున్న భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి చలించిపోయారు. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ రషీద్ కుమార్తె జోహ్రాను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తన తండ్రి మరణవార్త తెలిసి జోహ్రా కంటికిమింటికి ఏకధాటిగా ఏడుస్తున్న ఓ ఫోటో చూసి గౌతమ్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. జోర్హా చదువుకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని ప్రకటించారు. 'జోహ్రా, నీ కన్నీళ్లు ఆపలేకపోవచ్చు కానీ నీ కలలు పండించేందుకు నేను వెన్నంటే ఉంటాను. నిన్ను జీవితాంతం చదివించే బాధ్యత నేను తీసుకుంటాను' అంటూ గంభీర్ ట్విటర్‌లో తన సందేశాన్నిచ్చారు. 

Don't Miss