దయ చూపుతున్న హీరోలు...

15:17 - July 14, 2017

టాలీవుడ్..బాలీవుడ్...ఏ వుడ్ లోనైనా సినిమాలు ఘన విజయం సాధించడం..రికార్డులు బద్దలు కొట్టడం..పరాజయం కావడం చూస్తూనే ఉంటాం. ఘన విజయం సాధిస్తే కలెక్షన్ల పంట పడుతుంది. అదే సినిమా పరాజయం పాలైతే మాత్రం నిర్మాతలు..డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటుంటారు. తమకు జరిగిన నష్టాన్ని తీర్చాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు..హీరోలను కోరుతుంటారు. దయ తలిచిన హీరోలు వారిని ఆదుకుంటుంటారు. తాజాగా బాలీవుడ్ కు చెందిన ఇద్దరు హీరోలు డిస్ట్రిబ్యూటర్ల పట్ల దయ చూపారు.

బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' వరుస విజయపరంపరలకు 'ట్యూబ్ లైట్' చిత్రం బ్రేకులు వేసింది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాపీస్ వద్ద పరాజయం పాలైంది. గత చిత్రాల వలే ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని డిస్ట్రిబ్యూటర్లు భావించారు. కానీ అనూహ్యంగా బోల్తా కొట్టడంతో వారు నష్టాల పాలయ్యారు. తమను ఆదుకోవాలని డిస్ట్రిబ్యూటర్ల కోరికపై 'సల్మాన్' సానుకూలంగా స్పందించాడు. వంద కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని..నిర్మాతగా వ్యవహరించిన 'సల్మాన్' రూ. 55 కోట్లకు వెనక్కి ఇచ్చేశారు. నెక్ట్స్ సినిమా 'టైగర్ జిందా హై' తీసుకున్న పారితోషకాన్ని సగం వెనక్కి ఇచ్చేసి తక్కువ రేటుకు విక్రయించాలని నిర్మాతను 'సల్మాన్' సూచించినట్లు తెలుస్తోంది.

రణబీర్ కపూర్ మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాడు. తన సినిమా రిలీజ్ అయ్ని అనంతరం నష్టపోతే..రిటర్న్ ఇచ్చేస్తానని 'రణబీర్' ముందే పేర్కొంటుండడం గమనార్హం. ‘కత్రినా', ‘రణబీర్' జంటగా 'జగ్గా జాసూస్' చిత్రం రూపొందింది. కానీ సినిమా రిలీజ్ విషయంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. ఏడాది పాటు రిలీజ్ కు నోచుకోలేని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రానికి 'రణ్‌బీర్‌' కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఓ సంచనల ప్రకటన చేశాడు. ‘సినిమా ఫ్లాపయితే ఆ నష్టం భరిస్తాను. ధైర్యంగా నా సినిమాని విడుదల చేయొచ్చు..’ అంటూ ప్రకటించి అందర్నీ 'రణ్‌బీర్‌' ఆశ్చర్యానికి గురి చేశాడు.

మరి వీరి దారిలో ఇతర హీరోలు పయనిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

Don't Miss