విద్యార్థులపై ఆగని వేధింపులు

07:32 - September 12, 2017

హైదరాబాద్ : విద్యార్థులపై కార్పొరేట్‌ కాలేజీల వేధింపులు మాత్రం ఆగడం లేదు. ముగ్గురు లెక్చరర్స్‌ ఓ స్టూడెంట్‌ను వేధింపులకు గురిచేయడంతో అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. బాలాపూర్‌కు చెందిన మాణిక్‌ప్రభు, విజయశ్రీల కుమారుడు సంజయ్‌ చంపాపేట్‌లోని ఓ కార్పొరేట్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం ముగ్గురు కాలేజీ లెక్చరర్స్‌ సంజయ్‌ను వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన సంజయ్‌ కాలేజీ నుంచి ఇంటికి వెళ్లాడు. 5వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతడి తల్లిదండ్రులు బాలాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సంజయ్‌ పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. 48 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమంటున్నారు. తమ కుమారుడిని వేధించిన లెక్చరర్స్‌పై చర్యలు తీసుకోవాలని సంజయ్‌ తల్లిదండ్రులు కోరుతున్నారు. 

Don't Miss