ముకేశ్ అంబానీ ఇంట్లో శుభకార్యం...

13:25 - September 21, 2018

భారతదేశంలో అత్యంత కుబేరుడిగా పేరొందిన ముకేశ్ అంబానీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయన కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం కార్యక్రమం శుక్రవారం జరుగనుంది. బిజినెస్ దిగ్గజం అజయ్ పిరమాల్ కుమారుడైన ఆనంద్ పిరమాల్ తో ఈ 'ఎంగేజ్‌మెంట్' జరుగనుంది. ఇందుకు అంబానీ కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నిశ్చితార్థ వేడుకకు పలువురిని అంబానీ కుటుంబం ఆహ్వానించింది. కానీ ఈ వేడుక మాత్రం భారతదేశంలో జరగడం లేదు. ఇటలీలోని 'లేక్ కోమో'లో అట్టహాసంగా జరిగే నిశ్చితార్థం వేడుక మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ వేడుకలకు బాలీవుడ్ నటులతోపాటు ముకేశ్ అంబానీకి చెందిన దగ్గరి బంధువులు హాజరుకానున్నారు. 

శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిశ్చితార్థ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. శనివారం సంగీత్‌ వేడుకలు, ప్రత్యేక డిన్నర్‌...ఆదివారం లంచ్‌తో నిశ్చితార్థ వేడుకలు ముగియనున్నాయి. ఈ వేడుకకు వచ్చే అతిథులకు ప్రత్యేక డ్రెస్ ను ఎంపిక చేశారని టాక్. గత కొంతకాలంగా ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ లు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపారు. మే నెలలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రేమజంటను ఆశీర్వదించారు. డిసెంబర్‌లో వీరి వివాహాం జరుగనున్నట్లు తెలుస్తున్నది. ఇషా సోదరుడు ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతాల నిశ్చితార్థం జూన్‌లో జరిగిన విషయం తెలిసిందే. 

Don't Miss