ఇస్రో ఘన విజయం

10:59 - January 13, 2018

నెల్లూరు : రోదసిలో భారత కీర్తిపతాక రెపరెపలాడింది. అగ్రదేశాలకే సాధ్యమైన ఫీట్‌ను సాధించిన భారత అంతరిక్ష కేంద్రం ఘన విజయం సాధించింది. పీఎస్‌ఎల్‌వీ సీ-40 రాకెట్‌ను నింగిలోనికి పంపిన ఇస్రోకు సర్వత్ర ప్రశంశలు అందుతున్నాయి. తాజా విజయంతో ఈ ఏడాది చేపట్టబోయే చంద్రాయన్‌-2 ప్రయోగాన్ని మరింత ఉత్సాహంగా చేపడతామంటున్నారు. భారత అంతరిక్ష కేంద్రం ఇస్రో ఘన విజయం సాధించింది. నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధవన్‌ అంతరిక్షకేంద్రం నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ సీ-40 రాకెట్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది. 31 కృత్రిప ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. 
రికార్డు సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తలు 
పీఎస్‌ఎల్వీ సీ 40 రాకెట్ ప్రయోగం ద్వారా ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని రికార్డు సృష్టించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఉదయం 9గంటల 29 నిముషాలకు పీఎస్‌ఎల్వీ సీ-40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది.  వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్-2ఇ, ఒక నానో శాటిలైట్, ఒక సూక్ష్మ ఉపగ్రహంతో పాటు అమెరికా, బ్రిటన్ , రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఫ్రాన్స్, ఫిన్‌ల్యాండ్, కెనడాలకు చెందిన 28ఉపగ్రహాలు ఉన్నాయి. పీఎస్‌ఎల్వీ సీ-40 విజయవంతం కావడంతో రోదసిరంగంలో అగ్రగాములుగా ఉన్న అమెరికా, రష్యాల సరసన భారత్‌ చేరింది. అమెరికా, రష్యాల రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా సమీపకాలంలో ఎవరూ అందుకోని రికార్డును ఇస్రో సాధించింది. పీఎస్ఎల్వీ సీ-40 విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి ఇస్రో ఇచ్చిన కొత్త సంవత్సర కానుక అన్నారు ఇస్రో చైర్మన్ శివన్.
పీఎస్‌ఎల్వీ సీ 40తో ఘన విజయం 
సరిగ్గా నాలుగు నెలల కిందట సెప్టెంబర్‌ 2న పీఎస్‌ఎల్‌వీ సీ 39 ప్రయోగం విఫలం చెందడంతో .. సొంత నావిగేషన్‌ వ్యవస్థను ఒడిసిపట్టాలన్న భారత్‌ ఆశలకు కొంత అవాంతరం ఎదురైంది. అపజయం ఎదురైనా.. మరింత పట్టుదలగా శ్రమించిన మన శాస్త్రవేత్తలు.. పీఎస్‌ఎల్వీ సీ 40తో ఘన విజయం సాధించారు. ఈ విజయం భవిష్యత్తులో చేపట్టబోయే చంద్రయాన్‌ - 2 , జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 డీ2 , జీశాట్‌-11 లాంటి ప్రయోగాలకు ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు ఇస్రో 
తాజా విజయంతో అంతరిక్షప్రయోగాల్లో భారత్‌ను అగ్రరాజ్యాల సరసన నిలిపిన ఇస్రో శాస్త్రవేత్తలకు సర్వత్రా ప్రశంలు వస్తున్నాయి. 

Don't Miss