ఎన్నికలన్నీ ఒకేసారి జరగాలనేది చంద్రబాబు ఆలోచన : నారా లోకేష్

13:46 - September 10, 2017

విశాఖ : ఎన్నికలన్నీ ఒకేసారి జరగాలనేది చంద్రబాబు ఆలోచన అని... దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారన్నారు మంత్రి లోకేశ్‌. రాష్ట్రాభివృద్ధి కోసం తాము ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. దీంతో ఎన్నికలు ఎప్పుడు జరిగిన టీడీపీకి.. 80 శాతం ఓట్లు పడతాయన్నారు లోకేశ్‌. విశాఖలో ఇంటర్నేషనల్‌ ఇన్నోవేషన్‌ సదస్సుకు హాజరైన లోకేశ్‌... కొత్త ఆవిష్కరణలను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. ఏపీలో తయారైన వస్తువులను ఇంటర్నేషనల్‌ మార్కెట్‌కు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నామన్నారు లోకేశ్‌. 

 

Don't Miss