దబాంగ్ 3విలన్ జగపతిబాబు ?!..

16:22 - April 16, 2018

హీరోగా తన ప్రస్థానాన్ని ముగించి విలన్ క్యారక్టర్లలో ఒదిగిపోయి విభిన్నంగా విలనిజాన్ని పండిస్తున్న జగపతిబాబు పలు భాషల్లో నటించి శభాష్ అనిపించుకుంటున్నాడు. తెలుగులో విభిన్నమైన విలనిజానికి కేరాఫ్ అడ్రెస్ గా జగపతిబాబు మారిపోయిన జగ్గుభాయ్ తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఆయన విలన్ పాత్రలను చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి బాలీవుడ్ నుంచి ఛాన్స్ వచ్చింది .. అదీ సల్మాన్ సినిమాలోనని టాక్.

ప్రభుదేవా దర్శకత్వంలో దబాంగ్ 3?..
సల్మాన్ హీరోగా చేసిన 'దబాంగ్' .. 'దబాంగ్ 2' సినిమాలు ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పటి నుంచి వాళ్లు 'దబాంగ్ 3' కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందనేది తాజా సమాచారం. సల్మాన్ కి .. ప్రభుదేవాకి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రకి గాను ఆయన జగపతిబాబును ఎంపిక చేసుకున్నట్టు చెబుతున్నారు. ఇక జగపతిబాబు విలన్ గా బాలీవుడ్ లో ఏ స్థాయిలో విజృంభిస్తాడో చూడాలి.  

Don't Miss