వనపర్తిజిల్లాలో జనానికి బెల్లంకష్టాలు

15:40 - January 12, 2017

వనపర్తి : సంక్రాంతి పండగ పేరింటేనే.. నోట్లో బెల్లంముక్క వేసుకున్నట్టు తియ్యగా నవ్వుతారందరు. పండగపూట బెల్లంతోచేసిన పాయసం , అరిసెల్ని కమ్మగా లాగిస్తూ.. చుట్టపక్కాలతో సరదాకా గడిపేస్తుంటారు. కాని ..ఈసారి పండగపూట తేనెలరుచులు పంచే బెల్లం చేదెక్కింది. అధికారుల ఆంక్షలతో తీయ్యందనాల సంక్రాంతి కాస్తా.. చప్పగా మారుతోంది.

పండగ రోజుల్లో బెల్లంకష్టాలు ....

కొత్తజిల్లా వనపర్తిలో జనానికి బెల్లం కష్టాలు వచ్చిపడ్డాయి. అధికారుల ఆంక్షలతో పిండివటలు తీపిరుచులను కోల్పేయేపరిస్థితి వచ్చింది. జిల్లావ్యాప్తంగా ఏరులైపారుతున్న గుడుంబాను అడ్డకుకేనేందుకు ఎక్సైజ్‌ శాఖ బెల్లం అమ్మకాలపై ఆంక్షలు పెట్టింది. ఈ ఆంక్షలు ఇపుడు ప్రజలందరికీ ఇబ్బందిగా మారాయి. పండగపేరుతో అమ్ముతున్న బెల్లం మళ్లీ సారాతయారీకి వెళ్లుతుందని ఎక్సైజ్‌ అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే బెల్లం కొనుగోళ్లపై నజర్‌ పెట్టారు. ఒకటి రెండు కిలోలు కొనుక్కోవాలన్నా ఆధార్‌కార్డు తప్పని సరి చేశారు. అధికారుల ఆదేశాలతోనే ఆధార్‌ కార్డు నకలు కాపీ ఇస్తేనే బెల్లం అందిస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.

ఒక్కో ఆధార్‌ కార్డుపై 1కేజీ బెల్లం మాత్రమే....

ఒక్కో ఆధార్‌ కార్డుపై 1కేజీ మాత్రమే ఇస్తుండంతో బెల్లం షాపుల ముందు జనం బారులు తీరుతున్నారు. మరోవైపు ధరను కూడా ఆకాశానికెత్తేశారు వ్యాపారులు. కేజీ 60రూపాయలు చేసి అమ్ముతున్నారు. దీంతో పండగపూట బెల్లాన్ని చూస్తే బంగారం ధరలే గుర్తుకువస్తున్నాయని ఆదేవన చెందుతున్నారు ప్రజలు.

కేజీ బెల్లంతో పండగ ఎట్లా చేసుకోవాలి..?

పండక్కి కూతురు- అల్లుడు వచ్చారు.. రేషన్‌ ప్రకారం ఇస్తున్న ఒక కేజీ బెల్లాన్ని ఏం జేసుకోవాల అంటున్నారు వనపర్తి జిల్లా ప్రజలు. కిలో బెల్లంతో ఎన్నిరకాల పిండివంటలు చేసుకోవొచ్చో కూడా చెబితే బాగుంటుందని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖ తీరుపై జనం మండిపడుతున్నారు. నాటుసారా తయారీదారులను కంట్రోల్‌ చేయలేక ఇలా పండక్కికూడా బెల్లం అందకుండా చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. కావాల్సినంత బెల్లం అందించాలని..వనపర్తి జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Don't Miss