ప్రాణహానీ ఉందన్నాడు..అంతలోనే...

08:07 - May 10, 2018

జగిత్యాల : ధర్మపురిలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో రామగుండంకు చెందిన సత్యనారాయణగౌడ్ మృతి చెందాడు. ఇతను టిపిసిసి ఓబీసీ సెల్ జాయింట్ కన్వీనర్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కమలాపూర్ లో ఎల్లమ్మ పట్నాల కార్యక్రమానికి ఇతను హాజరయ్యారు. ధర్మపురిలోని సత్య వైన్స్ వద్ద మద్యం కొనుగోలు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. రెండు బుల్లెట్లు శరీరంలోకి దూసుకపోవడంతో సత్యనారాయణ గౌడ్ అక్కడికక్కడనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపు చనిపోయాడు. తనకు ప్రాణహానీ ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది గంటల్లోనే ఈ హత్య జరిగింది. ముంబైలో జరిగిన గొడవల కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Don't Miss