జల్లికట్టు నిర్వహణకు ఒక్కటైన తమిళనాడు ప్రజలు

10:35 - January 10, 2017

చెన్నై : తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు నిర్వహణకు తమినాడు ప్రజలంతా ఒక్కటయ్యారు. ఆర్డినెన్స్ తెచ్చి అయినా ఈసారి ఈ క్రీడను నిర్వహించాలని ఆ రాష్ట్ర సీఎం పన్నీరు సెల్వం భావిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్రానికి లేఖ రాశారు. చెన్నైలో నిన్న ప్రజలందరూ జల్లికట్టుకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు జల్లికట్టు అంశంపై సినీ హీరో కమల్ హాసన్ స్పందించారు. జల్లికట్టు అంటే ఇష్టం లేనివారు బిర్యానీ తినడం కూడా మానేయాలని సూచించారు. తమిళులు సంప్రదాయమైన జల్లికట్టు క్రీడంటే తనకు ఎనలేని అభిమానమని పేర్కొన్నారు. స్పెయిన్‌లో ప్రజలు పశువులను గాయపర్చడం వల్ల అవి ప్రాణాలు కోల్పోతాయనీ... అయితే తమిళనాడులో ఎద్దులను దేవుడిగా కొలుస్తారని, తమ కుటుంబంలో ఓ సభ్యుడిగా భావిస్తారని గుర్తుచేశారు.

Don't Miss