టీడీపీ, వైసీపీలపై పవన్‌కల్యాణ్‌ మాటల తూటాలు

11:07 - June 4, 2018

విజయనగరం : ఓ వైపువర్షం.. మరోవైపు జనప్రవాహం... పవర్‌ పంచ్‌లకు యూత్‌ కేరింతలు...  టీడీపీ వైసీపీలపై వపన్‌ ఘాటు విమర్శలు...  ఉత్తరాంధ్రలో జనపోరాట యాత్ర జోరుగా సాగుతోంది. విజయనగరంలో జనసేనాని ప్రత్యర్థిపార్టీలపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ఉత్తరాంధ్రలో జనసేనాని పవన్‌కల్యాణ్‌ జనపోరాటయాత్ర జోరుగా సాగుంతోంది.. వెనుకబాటు తనం పోవాలంటే జనసేన అధికారంలోకి రావాలని పవన్‌ పిలుపునిస్తున్నారు. పవన్‌ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 

విజయనగరం జిల్లాలో దశాబ్దాలపాటు కొన్ని కుటుంబాలే పెత్తనం చేస్తున్నాయని.. నేతల స్వార్థంతో  జిల్లాలో అభివృద్ధి జాడలే లేకుండా పోయాయని పవన్‌ విమర్శలు ఎక్కుపెట్టారు. విజయనగరాన్ని స్మార్ట్‌సిటీ అని చెబుతున్న పాలకులకు ఇక్కడ మంచినీటి కష్టాలు కనిపించడం లేదా అని జనసేనాని ప్రశ్నించారు. అభివృద్ధి అమరావతిలోనే కాదు ఉత్తరాంధ్రలోకూడా కావాలని ముఖ్యమంత్రికి చంద్రబాబుకు వినిపించేలా యువత గర్జించాలనన్నారు జనసేన అధినేత. 

మరోవైపు జనసేన ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు తమ  కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడుల వెనుక టీడీపీ, వైసీపీ నేతలు ఉన్నారని కూడా ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని పవన్‌ హెచ్చరించారు. 2019లో అవినీతి నేతలకు ఉత్తరాంధ్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. 

ఉత్తరాంధ్రలో యుత కదిలితే మంచిమార్పు సాధ్యం అవుతుందన్నారు. అభివృద్ధిని కాంక్షించే ప్రతివారు జనసైన్యంతో కలిసిరావాలని వపన్‌  పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతంపాడి సమయం వచ్చిందని.. 2019 ఎన్నిల్లో జనసేన సత్తాచాటుతుందంటున్న పవన్‌.. ప్రత్యర్థి పార్టీలపై  హైరేంజ్‌లో విమర్శలు చేస్తుంటంతో ఏపీ రాజకీయాల్లో హీట్‌ పెరిగింది.    

Don't Miss