ప్రశ్నిస్తే దబాయిస్తారా ? జానారెడ్డి

12:17 - November 14, 2017

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉద్యోగాల భర్తీపై టీడీపీ, ప్రైవేట్ స్కూల్‌ టీచర్లకు కనీస వేతనంతో పాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని సీపీఎం, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్చకు బీజేపీ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు జానారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి నష్టం చేకూరే విధంగా అప్పులు చేయవద్దని...రాష్ట్రానికి ఆస్తులంటే...లాభం వచ్చే విధంగా అప్పులు చేయాలని సూచించారు. జిమ్మిక్కు సర్ ప్లస్ చేశారని పేర్కొన్నారు. పాలనలో తప్పులపై ప్రశ్నిస్తే తమను దబాయిస్తే ఎలా అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా, ప్రజలకు న్యాయం జరగాలన్నారు. సమస్యలపై ఆరోగ్యవంతమైన చర్చ జరగాలని కోరారు. బడ్జెట్ పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
కిషన్ రెడ్డి 
బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ వివిధ కార్పొరేషన్ కు సంబంధించి ఎన్ని నిధులు మంజూరు చేశారో చెప్పాలని అన్నారు. సీఎం ఇళ్లు ప్రగతి భవన్ కు, కొత్త సచివాలయానికి వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని కానీ ప్రజా సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయడం లేదని విమర్శించారు.   
ఈటెల రాజేందర్ 
ప్రగతి భవన్ తెలంగాణకు ఆత్మగౌరవం అని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఇరిగేషన్, 24 గంటల విద్యుత్, రోడ్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు తమ ప్రాధాన్యమని చెప్పారు. ఎఫ్ ఆర్ బీఏం, గ్యారంటీసు రుణాలు వేర్వేరని తెలిపారు. తెలంగాణ ఆర్థిక ప్రగతిని కాంగ్రెస్ సభ్యులు చూడలేకపోతున్నారన్నారు. అనంతరం హరీష్ రావు, ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడారు.  

Don't Miss