ప్రకృతి వ్యవసాయం : పారినాయుడు

08:49 - August 8, 2017

అతి తక్కువ భూమిలో అతి తక్కువ ఖర్చుతో ఒక కుటుంబానికి సరిపడ ఆహారాన్ని, ఆదాయాన్ని సమకూర్చుకోవడం ఎలా అన్న అంశంపై కేంద్రీకరించి పనిచేస్తున్న జట్టు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ డొల్లు పారినాయుడుగారు ఇవాళ్టి జనపథంలో పాల్గొంటున్నారు. ఆయన రూపొందించిన నమూనా అనేకమందిని ఆకర్షిస్తోంది. ఆయన రూపొందించిన అన్నపూర్ణ సాగు అనే విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ, నాబార్డు ప్రామాణిక విధానంగా గుర్తించడం మరో విశేషం. గిరిజన సంక్షేమ పథకాల మీద గిరిజన యువతకు అవగాహన కల్పిస్తూ, వాటిని వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ కోసం ఆయన రూపొందించిన అగ్రికల్చర్ కిట్ పలువురి మన్ననలు పొందింది. వ్యవసాయ సాగు విధానాలు, ఎరువుల తయారీ, మనకు అందుబాటులో వున్న వనరులతో ఎలా చేసుకోవాలో కథల రూపంలో, సిడిల రూపంలో 18 పుస్తకాలతో కిట్ ను రూపొందించారు. ఈ కిట్ లో వున్న ప్రధానాంశాలు ఏమిటి? ఈ కిట్ ను ఎలా పొందవచ్చు? ఇదే అంశంపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Don't Miss